రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంఖుస్థాపన చేయనున్నారు.
ప్రభుత్వ జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు.. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జీవోల గోప్యతపై హైకోర్టులో వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన స్టార్ట్ చేయనున్నారు. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు కానుంది.
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాల నాయకులను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి వారికి మద్దుతు ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిశ్రమ సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానాన్ని స్టార్ట్ చేయగా.. నేటి నుంచి రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.
దీపావళి సెలవులో కీలక మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవుగా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.
దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యనించారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ జగన్ సర్కార్ చట్టం చేసింది.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం వుళేబీడు గ్రామ సమీపంలో వేరు శనగ పంట పొలాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ఆలూరులో మంత్రి జయరాం ఉండి కూడా పంట పొలాలను పరిశీలించకపోవడం చాలా బాధాకరం అని ఆయన వ్యాఖ్యనించారు.