Amaravati: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విభాగాల వారీగా ఫ్రీ అకామిడేషన్ పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. సెక్రటేరీయేట్, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పని చేస్తూ ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై సర్కార్ ఆరా తీస్తోంది.
Also Read: Andhrapradesh: ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
వివరాలివ్వాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకూ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) నోట్ పంపింది. అమరావతికి వచ్చి ప్రభుత్వం కల్పించే ఉచిత వసతిలో ఉంటున్న మహిళ, పురుష ఉద్యోగుల వివరాలివ్వాలని జీఏడీ ఆదేశించింది. ఆయా విభాగాల హెచ్వోడీలు సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల ఐడీ కార్డుల నకళ్లను అత్యవసరంగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2024 జూన్ 26 వరకూ పొడిగిస్తూ సెప్టెంబరులో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.