Andhrapradesh: వైఎస్సార్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైఎస్సార్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటించబడ్డాయి. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఎంపికైన వారి జాబితాను కమిటీ వెల్లడించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా అవార్డులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటిన ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరగనుంది. వరుసగా మూడో సంవత్సరం, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డుల్ని కమిటీ ప్రకటించింది. కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జీ.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కమిటీ ఈ ప్రకటన చేసింది. ఈ రోజు ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైయస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు; 4 ఎచీవ్‌మెంట్ అవార్డులు ఉన్నాయి.
Also Read: CM YS Jagan: సీఎం మాత్రమే మారాడు.. అప్పుడు ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
2023లో వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపిక అయిన వారు– వారి జిల్లాల జాబితా:
వ్యవసాయం:
1) శ్రీమతి పంగి వినీత– (ఎచీవ్‌మెంట్ అవార్డు)
2) వై.వి.మల్లారెడ్డి– అనంతపురం
ఆర్ట్ అండ్ కల్చర్:
1) యడ్ల గోపాలరావు– రంగస్థల కళాకారుడు– శ్రీకాకుళం
2) తలిసెట్టి మోహన్– కలంకారీ– తిరుపతి
3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల
4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ– కాకినాడ
6) ఎస్.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా
7) శ్రీమతి రావు బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు
8) తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం
9) చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం
10) శ్రీమతి కలీసాహెబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం
తెలుగు భాష– సాహిత్యం:
1) ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి
2) ఖదీర్ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్ అవార్డు)
3) శ్రీమతి మహెజబీన్– నెల్లూరు (ఎచీవ్‌మెంట్ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం
క్రీడలు:
1) శ్రీ పుల్లెల గోపీచంద్– గుంటూరు
2) శ్రీమతి కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం
వైద్యం:
1) ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్– వైయస్సార్
మీడియా:
1) గోవిందరాజు చక్రధర్– కృష్ణా
2) హెచ్చార్కే– కర్నూలు
సమాజ సేవ:
1) బెజవాడ విల్సన్– ఎన్టీఆర్
2) శ్యాం మోహన్– అంబేద్కర్ కోనసీమ– (ఎచీవ్‌మెంట్)
3) నిర్మల హృదయ్ భవన్– ఎన్టీఆర్
4 జి. సమరం– ఎన్టీఆర్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?