ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.. ప్రజా సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.. పవన్ను కలిసిన నిరుద్యోగ యువత వారి ఆవేదనకు ఆయనకు తెలియజేశారు.. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. రేపు ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్త ఓ…
పెట్రోల్ ధరలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని చురకలు అంటించారు. read also…
2021-24 ఐటీ పాలసీ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఐటీ పాలసీ రూపకల్పన చేశారు.. ఇన్క్యూబేషన్ సెంటర్లు, స్టార్టప్స్కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది సర్కార్.. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.. రానున్న పదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పన్నుల రూపంలో రూ. 783 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఐటీ…
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతూనే ఉంది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సృష్టిస్తున్న అడ్డంకులు, అవరోధాలు, అక్రమాలపై సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” పరిధిని వెంటనే నోటిఫై చేయాలని… తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఈ పిటిషన్ లో పేర్కొంది ఏపీ సర్కార్. read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్…
కొత్త 104 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 539… 104 అంబులెన్స్ వాహనాలను కొనుగోలు చేయనున్నారు.. రాష్ట్రంలోని ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ 104 అంబులెన్సు వాహనాన్ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. రూ. 89.27 కోట్లతో 104 అంబులెన్సు వాహనాలను కొనుగోలు చేయనున్నారు.. ఏడాదికి రూ. 75.82 కోట్ల మేర ఈ వాహనాలపై వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం… గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామ్లీ విధానం…
పోలవరం నిర్వాసిత గిరిజనులపై సీఎం వైఎస్ జగన్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ బీజేపీ నేతల బృందంతో కలిసి దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితుల కాలనీలు పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 78 శాతం పూర్తయితే నిర్వాసితుల కాలనీలు 21శాతం మాత్రమే నిర్మాణం జరిగాయన్నారు.. దేవీపట్నం నిర్వాసితుల కాలనీల్లో కరెంటు కూడా లేక భయానక వాతావరణం నెలకొనిఉందన్న ఆయన.. నిర్వాసితుల ఇళ్లకు శ్లాబ్ని…
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.. దాదాపుగా నామినేటెడ్ పదవుల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందని… రేపే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ప్రచారం సాగుతోంది.. బుధవారం రోజు 60 నుంచి 70 వరకు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉండగా.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన, పలు కారణాలతో టికెట్ పొందని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్… ఇప్పటి వరకు ప్రముఖంగా వినిపిస్తున్న కొన్ని పేర్లను పరిశీలిస్తే..…
మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు.…
తెలుగు అకాడమీ పేరును మార్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలుగు అకాడమీ పేరును.. తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… ఇక, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో నలుగురిని నియమించింది సర్కార్… తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి. భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకుడు డాక్టర్ నెరేళ్ల రాజ్కుమార్, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం విజయశ్రీ, ఎస్ఆర్ఎస్వి బీఈడీ కాలేజికి చెందిన లెక్చరర్ కప్పగంతు…
భూముల మార్కెట్ ధర సవరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఏడాది పాటు భూముల మార్కెట్ ధరలను సవరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది… వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు భూముల మార్కెట్ ధరలను సవరించేదే లేదని స్పష్టం చేసింది… కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు ఇబ్బందులుండడంతో భూముల మార్కెట్ ధరల విషయంలో సవరణ చేయకూడదని ప్రభుత్వం భావించగా.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ.. దీంతో..…