కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం… రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై మంగళవారం సీమక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం… కాగా, ప్రస్తుతం నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలు చేస్తుండగా.. అవే ఆంక్షలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.. ఇక, కరోనా కట్టడిలో భాగంగా భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాల్సిందే.