పెట్రోల్ ధరలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని చురకలు అంటించారు.
read also ; చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన ట్వీట్…!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదు?అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డులు పెట్టారంటే మీ దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుందని మండిపడ్డారు.