ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదా.. జనసేనాని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.. ప్రజా సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.. పవన్‌ను కలిసిన నిరుద్యోగ యువత వారి ఆవేదనకు ఆయనకు తెలియజేశారు.. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. రేపు ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్త ఓ వీడియో విడుదల చేశారు పవన్ కల్యాణ్.
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యలపై ఈ విడియోలో స్పందించిన జనసేనాని.. రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు సృష్టించారు.. కానీ, ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదని మండిపడ్డారు.. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ కలచివేస్తోందన్న ఆయన.. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 30 లక్షల మంది సపోర్టు కారణం అన్నారు.. 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 10 వేల ఉద్యోగాలతో.. జాబ్ క్యాలెండర్‌లో పెట్టారని.. ఇది నిరుద్యోగులను నయవంచన చేయటమేనని మండిపడ్డారు.. ఇక, పోలీసు శాఖలో వేల పోస్టులు ఉంటే జాబ్ క్యాలెండర్‌లో వందల పోస్టులే పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. డీఎస్సీ ఊసే లేదన్నారు.. నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుంది, రేపు అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని.. జనసైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
తాజావార్తలు
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!