2021-24 ఐటీ పాలసీ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఐటీ పాలసీ రూపకల్పన చేశారు.. ఇన్‌క్యూబేషన్ సెంటర్లు, స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది సర్కార్.. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.. రానున్న పదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పన్నుల రూపంలో రూ. 783 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఐటీ రంగం ద్వారా ఉద్యోగుల జీతాలు, ఖర్చులు, తద్వారా రూ. 2200 కోట్లు ప్రతేడాది ఆదాయం రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ విధానానికి అనువైన ఎకో సిస్టమ్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.. గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోనుంది సర్కార్.. స్టార్టప్స్ కోసం రూ. 100 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.