జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రోజురోజుకీ దివాలా తీస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేశామని చెప్పినా ఏమి చేయలేకపోతున్నారు. విద్యావిధానం మీద స్పష్టత లేదు.. తెలుగును చంపేసే పరిస్థితి తీసుకొచ్చారు. మీ పరిపాలన గురించి ప్రజలకు అర్థమవుతోంది అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ బిల్లులు చెల్లించలేని బతుకు మీది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కనీసం టెండర్లకు పిలిచినా ఎవరు రావడం లేదంటే పరిస్థితి ఎంత దిగజారిపోయింది. చెబితే వినరు.. ఎవరు సలహా ఇచ్చినా తీసుకోరు. చివరకు సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు అని తెలిపారు. పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలను సాధించే బాధ్యత మీ మీదే ఉంది. చంద్రబాబు, జగన్ చెరో వైపు వైపు కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారు అని పేర్కొన్నారు.