Sajjala: సీపీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలి.. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీసీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని.. ప్రభుత్వం చేసిన కొన్ని ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. సీపీఎస్ అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీ వేశారని.. ఓపీఎస్ వల్ల జరిగే భవిష్యత్తులో ఆర్ధికపరంగా విపత్తు వచ్చే అవకాశం ఉందని సజ్జల వివరించారు.
Read Also: Tirumala Temple: రెండు రోజుల పాటు మూతపడనున్న తిరుమల శ్రీవారి ఆలయం.. ఎందుకంటే..?
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ప్రేమ ఉండబట్టే రిటైర్ అయిన తరువాత వారికి కనీస భద్రత కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని సజ్జల వెల్లడించారు. కనీసం ఉద్యోగికి నెలకు రూ. 10 వేల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తామని.. రూ.20వేల లోపు బేసిక్ పే ఉన్నవారికి 40 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందిస్తామని సజ్జల అన్నారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో హెల్త్ స్కీంను అమలు చేస్తామని చెప్పారు. మరిన్ని అవసరాలు, ప్రతిపాదనలు ఉంటే చెప్పమని ఉద్యోగులను కోరామన్నారు. ఇప్పటికే పెన్షన్ కోసం 20 వేల కోట్ల రూపాయలు అవుతుందని.. తమది రాజకీయ అవకాశవాదం కాదన్నారు. 20, 30 ఏళ్ళ తర్వాత రాష్ట్రం ఎలా ఉన్నా తమకేంటి అనుకునే స్వభావం ముఖ్యమంత్రి జగన్‌ది కాదన్నారు. తమ చిత్తశుద్ధిని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని.. అసలు చర్చలకు వచ్చేది లేదని ఉద్యోగులు చెప్పడం కరెక్ట్ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!