Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని.. సారా చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు. బీ3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని.. అయ్యన్న పాత్రుడు వంటి అనేక మంది నాయకుల ద్వారా భువనేశ్వరి, బ్రాహ్మణ మద్యం వ్యాపారం చేయిస్తున్నారని.. వాళ్లకు మద్యం నుంచి రోజుకు వచ్చే ఆదాయం రోజుకు కోటి రూపాయలు ఉంటుందని ఆరోపించారు. నారా కుటుంబానిది తాగుబోతుల ఫ్యామిలీ అని.. మద్యం మత్తులో అత్తాకోడళ్ళు కొట్టుకున్నారని.. పప్పు నాయుడుకు మగువ, మద్యం లేనిదే రోజు గడవదని విమర్శించారు.
కోతి కల్లు తాగి వ్యవహరించినట్లు కుప్పంలో చంద్రబాబు మాట్లాడటం చూశామని పోతుల సునీత వ్యాఖ్యానించారు. మహిళలు అంటే మర్యాదగా వ్యవహరించటం చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. పవర్ స్టార్ అంటూ తన దత్త పుత్రుడు పేరు, లెజెండ్ అంటూ తన వియ్యంకుడు పేరుతో బ్రాండులను తెచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు 200కు పైగా మద్యం బ్రాండులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారించాడని.. తండ్రీ, కొడుకులు ఇద్దరికీ తాగితే కానీ నోరు పెగలదని పోతుల సునీత విమర్శించారు.
Read Also: Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి
అటు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కూడా నారా కుటుంబంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో B-3 కుంభకోణం జరిగిందని.. బీ3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. వైఎస్ భారతిపై టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. పచ్చ కామెర్ల మాదిరిగా బ్రహ్మణి, భువనేశ్వరీలను చూసి టీడీపీ నేతలు భారతమ్మపై విమర్శలు చేస్తున్నారని.. అసలు లిక్కర్ స్కాం వెనుక భువనేశ్వరి దేవి పాత్ర ఉందన్నారు. చంద్రబాబు హయాంలో అతని పేషీలో వ్యక్తి ద్వారా లిక్కర్ కమిషన్ భువనేశ్వరి తీసుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. నారా కుటుంబం కాదు సారా కుటుంబం అని చురకలు అంటించారు. 254 బ్రాండ్లు టీడీపీ హయాంలో వచ్చాయని.. అయ్యన్నకు చెందిన విశాఖ డిస్టలరీ అనుమతులు భువనేశ్వరి ద్వారానే దక్కాయన్నారు. ఆదికేశవులు నాయుడు, యనమల కుటుంబాల డిస్టలరీలు ఎలా వచ్చాయని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నిలదీశారు. జగన్ హయాంలో అక్రమ మద్యానికి బ్రేక్ పడిందని.. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందన్నారు. వైసీపీకి, సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని.. దేశంలో బెస్ట్ సీఎంగా భారత్‌లో మూడో స్థానంలో సీఎం జగన్ ఉన్నారన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ దూరమైన ప్పటి నుంచి జగన్‌పై పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు.