Andhra Pradesh: ఏపీలో వివాదాస్పదంగా మారిన జీవో నంబర్ 1పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి ముందే జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తమను అణిచివేసేందుకే ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని మండిపడుతున్నాయి.
Read Also: Somu Veerraju: ఏపీలో ఆందోళనలపై ప్రెజంటేషన్‌కు మోదీ ప్రశంసలు
ఈ నేపథ్యంలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 1ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈనెల 23వ తేదీ వరకు జీవో నంబర్ 1ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. దీంతో ఈనెల 20లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఇంతలోనే వైసీపీ సర్కారు సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేసింది.