Employees: ప్రభుత్వంలో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు.. నేతల స్పందన ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Employees: పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్. 16 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే.. అందులో 3 వేల కోట్ల బిల్స్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నాం అన్నారు.. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.. ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడింది.. ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం అన్నారు. వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం అని తెలిపారు. ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
అయితే, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఛాయ్, బిస్కట్ సమావేశం కాదు.. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. డీఏ బకాయిలను రెండు క్వార్టర్లల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.. మొత్తంగా రూ. 16 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉంటే.. రూ. 3 వేల కోట్లు క్లియర్ చేస్తామన్నారని.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు.. కోవిడ్ వల్ల ఒకటో తేదీన జీతాలివ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పింది.. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కోవిడ్ ప్రభావం ఉంటుందని సెటైర్లు వేశారు. ఇక, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలపై కసరత్తు చేయలేదని ప్రభుత్వం చెప్పింది.. పెండింగ్ డీఏల బకాయిలే ఎక్కువగా ఉంటాయి. రూ. 3007 కోట్లను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని చెప్పిందని వెల్లడించారు. మరి కొన్ని నవంబర్ నెలాఖరులోగా రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. పెండింగ్ డీఏల విషయంలో చర్చించుకుని చెబుతామన్నారు.. పీఆర్సీ ఎరియర్స్ పై చర్చించి చెబుతామన్నారని తెలిపారు..
ఇక, సీపీఎస్ రద్దు మీద చాలా సేపు చర్చించామని వెల్లడించారు బొప్పరాజు.. మార్చి 2022లోగా సీపీఎస్ అంశంపై స్పష్టత ఇస్తామన్నారు.. కానీ, 2023 మార్చి వచ్చేసింది.. సీపీఎస్ ఉద్యోగులకు చెందిన వాటాను తిరిగి చెల్లిస్తామని హామీనిచ్చారని తెలిపారు.. అయితే, మా ఉద్యమ కార్యాచరణ యథావిథిగా జరుగుతుందని తెలిపారు. త్వరలో మా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చిస్తాం.. కార్యవర్గ సమావేశంలో చర్చించి.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.. ఇక, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలను ఉగాదిలోగా చెల్లించేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది.. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశంలో ఆర్థికపరమైన అంశాలపై హామీ లభించిందన్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!