R 5 zone: ఆర్ 5 జోన్ విషయంలో ముందడుగు.. గెజిట్ జారీ చేసిన ఏపీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R 5 zone: రాజధానిలో ఆర్-5 జోన్ విషయంలో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది సర్కార్.. 900 ఎకరాల భూముల్ని ఆర్-5 జోన్ పరిధిలోకి తెచ్చారు.. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేసన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఆ ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: Manchu Manoj: మంచు మనోజ్ నోట ఆ మాట.. మౌనిక ఎమోషనల్..
Also Read
మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలోని భూములకు నోటిఫికేషన్ చేశారు.. తూళ్లురు మండలం మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో గ్రామాల పరిధిలోని భూములకు నోటిఫికేషన్ ఇచ్చారు.. మొత్తంగా 900 ఎకరాల భూములకు నోటిఫికేషన్ ఇచ్చారు.. కాగా, ఆర్-5 జోన్ ఏర్పాటుపై 2022 అక్టోబరులో ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. దీని వల్ల రాజధాని అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా… ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. ఈమేరకు రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేశారు రైతులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచిచూడాల్సిన విషయం.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!