Kurasala Kannababu: మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు.. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిసిశారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేం ఉన్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని…
తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్... వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక చర్చలు జరగనున్నాయి.. దాంతో, పలు సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై చర్చ జరగనుండగా.. వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు.
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ - ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్లు.
మెడికల్ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేతలను బ్యాలెన్స్ చేసే విధంగా వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మూడు పార్టీలకు న్యాయం చేసే విధంగా ఈ నియామకాలు చేపడుతూ వచ్చారు.. ఇక ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించింది కూటమి ప్రభుత్వం..
శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్గా మారాయి.
పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. Also Read:Bigg Boss 9 : రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తనూజ అతనితో.. అరేయ్ ఏంట్రా ఇది.. ఈ జీవో ప్రకారం, ‘ఓజీ’ సినిమా విడుదలైన…
కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. కూటమి పాలన అంటూ ఏమీ లేదు... ఆది కేవలం టీడీపీ పాలనే అన్నారు.. టీడీపీ వాళ్ల ఒక్కరి పైనే పాపం పడిపోకుండా.. కూటమి అని చెప్పుకుంటున్నారు.. కానీ, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం పని చేసే పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు.
సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్ట్ ల పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.. మంత్రులు వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథిలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది కూటమి సర్కార్.. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది..