ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది.. దీపావళికి రెండు రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పాలనుకుందో.. ఏమో.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో.. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డీఏ.. ఇతర అంశాలు చర్చించారు… ఇవాళ ముగ్గురు మంత్రులు.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు.. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహా మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ లను ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు..
Read Also: IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ ప్రతినిధులతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరుపనున్నారు.. ఉద్యోగుల ఆర్ధిక పరమైన సమస్యలకు సంబంధించి చర్చ జరగనుంది.. డీఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో డీఏ కు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు.. పెండింగ్ లో ఉన్న డీఏలతో పాటు కొత్త పీఆర్సీ కోరుతున్నారు.. జీపీఎఫ్ బకాయిలు.. కారుణ్య నియామకాలు. ప్రమోషన్లు.. అంతర్గత సమస్యలు… మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్.. ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ జరిగే సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: Ram Gopal Varma: ఆర్జీవీకి మరో షాక్.. రాజమండ్రిలో మరో కేసు నమోదు
మరోవైపు, ఉద్యోగ సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత… సాయంత్రం సీఎం చంద్రబాబుతో ముగ్గురు మంత్రులు భేటీ కానున్నారు.. ఇవాళ రాత్రి కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీపావళి కానుకగా డీఏ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఉద్యోగుల్లో బాగా చర్చ జరుగుతోంది.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో చర్చలు జరగనున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో పాటు… సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.. అదే విధంగా గుర్తింపు పొందిందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.