గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ ఆంగన్వాడీ కేంద్రాలను మెయిన్ ఆంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనుంది.. ఈ అప్‌గ్రేడ్ కారణంగా, కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
Amaravathi: అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బృందం యోకోహామా నగరంలో “క్లైమేట్ యాక్షన్, స్మార్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ మేనేజ్మెంట్లో టెక్నాలజీ వినియోగం, ఆర్థిక అభివృద్ధి” నమూనాలను కూడా అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా హోకుబు స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ బృందం యోకోహామా సిటీలో ఐదు రోజుల అధ్యయన పర్యటనలో ఉన్నారు.…
AP People Returned From Nepal: నేపాల్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న తెలుగు ప్రజలు ప్రభుత్వం చొరువతో స్వస్థలాలకు చేరుకున్నారు. తాము అక్కడ ఉన్నన్ని రోజులు భయం భయంగా గడిపామని.. రోడ్లపై రాడ్లు, ఇతర ఆయుధాలతో ఆందోళనకారులు తిరుగుతున్నారని తెలుగు యాత్రికులు తెలిపారు. మరవైపు రాష్ట్రానికి చేరుకున్న యాత్రికులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు. జన్ జెడ్ ఆందోళనలో భాగంగా నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.…
ఒకేసారి 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలనలో మార్పులు. మరింత చురుగ్గా పాలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే మూడేళ్ల పాటు మంచి టీమ్ ఉండాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు. అందుకు అనుగుణంగా ఇప్పటకిఏ సీనియర్ అధికారులను బదిలీ చేశారు.. ఇప్పుడు.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపటానికి ఇబ్బంది ఏమిటి..? అంటూ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అన్నారు.
Kakani Govardhan Reddy: నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబుకు మా నిరసనతో అర్థమైంది అన్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి వారి పోరును నీరుగార్చాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి చోట నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు విధించడం, కేవలం 15 మందితోనే ర్యాలీ నిర్వహించాలన్న నియమాలను కఠినంగా…
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్.. ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..