నంద్యాల జిల్లాలో పర్యటించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ అధిష్టానందే తుది నిర్ణయం అని ఆమె చెప్పుకొచ్చారు. రేపు అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించక పోవడం శోచనీయం అని అన్నారు. తెలుగు దేశం- వైసీపీ ప్రభుత్వాలు తమ స్టిక్కర్లు వేసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలను హైజాక్ చేశాయని ఏపీ బీజేపీ చీఫ్ ఆరోపించారు. ఓర్వ కల్లులో విమానాశ్రయం నిర్మాణానికి నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే అని వెల్లడించారు.
Read Also: Malla Reddy: త్వరలో పులి బయటకు వస్తోంది… అప్పుడు ఆట మొదలవుతుంది
దేశ ప్రజల శతాబ్దాల కల రేపు సహకారం అవుతుంది అని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. శ్రీ రాముని విగ్రహ ప్రతిష్టను అందరూ ప్రత్యేక్షంగా వీక్షించాలని కోరారు. శ్రీశైలంలో రేపు శివయ్యను దర్శించుకుని.. అక్కడే రాముని విగ్రహ ప్రతిష్టను లైవ్ లో తిలకిస్తాను అని ఆమె వెల్లడించారు. రేపు ఏపీలో సెలవు ప్రకటించాలని బీజేపీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని పురంధేశ్వరి పేర్కొన్నారు.