ఏపీ సర్కార్ మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.. ఈ సెంటర్ల ద్వారా.. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు..
Fact Check: సోషల్ మీడియాలో ఓ నకిలీ భూమి పట్టా సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో దానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూమి పట్టాలో ఓ భూమికి సంబంధించిన అడంగల్ పత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపులు మంత్రి సత్యప్రసాద్ ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోని కొందరు కావాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో…
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.
VCs in Universities: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాలకు ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియామించింది. ఈ సందర్భంగా ఓ జాబితాను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ చేపడుతోంది. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పని చేసే వాళ్లల్లో ఎవరు దీనికి కారకులనే దానిపై సీఎంవో ఆరా తీస్తోంది.