Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు దోచేశారు.. ఇదంతా జగన్ డైరెక్షన్లో జరిగింది అని ఆరోపించారు.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కలెకర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది.