Andhra Pradesh: ఏపీలో ప్రజలకు గుడ్‌న్యూస్.. రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులు
- ఏపీలో సామాన్యులకు శుభవార్త
- తక్కువ ధరలకే రైతు బజార్లలో నిత్యావసర సరుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తోంది. కందిపప్పు, బియ్యంను తక్కువ ధరలకు రైతు బజార్లలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. ఏపీలో బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బియ్యం ధరలు మండిపోతున్నాయని..వాటిని తగ్గించేందుకు నిర్ణయించారు.
Read Also: Srisailam Inflow: శ్రీశైలానికి తగ్గిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేపటి(గురువారం) నుంచి తగ్గించిన ధరలతో ఈ సరుకులు విక్రయిస్తారని తెలిపారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 ఉండగా.. రూ.150కీ విక్రయిచనున్నారు. బియ్యం రూ.48 నుంచి రూ.47కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కీ తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం- ఈ నెల రోజుల్లోపున బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించడమైనది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.150కీ, బియ్యం రూ.48 నుంచి రూ.47కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కీ తగ్గించడమైనది. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను… pic.twitter.com/zUzeL4R6Dw
— Manohar Nadendla (@mnadendla) July 31, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!