Guntur: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ప్రభుత్వ ఫైళ్లు కలకలం సృష్టించాయి.. గుంటూరులో పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ రోడ్డుపక్కన చెత్తుకుప్ప దగ్గర ప్రత్యక్షం అయ్యాయి.. పోలీస్ శాఖ లేక రెవెన్యూ అధికారులకు సంబంధించినవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఫైల్స్ దగ్ధం ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ ఘటనపై సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.. బేవరేజెస్ కార్పొరేషన్‌లోని అధికారులు, సిబ్బంది పాత్రపై లోతుగా విచారణ కొనసాగుతోంది.. మరోవైపు, మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటను కూడా తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ నేపథ్యంలో రోజుకు ఒక శాఖ ఫైల్స్ బయటపడటంతో.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.