AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పని తీరు మెరుగు పరిచే విషయమై కసరత్తు చేస్తుంది. స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో- సెబ్ రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులు చేసేలా చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులపై అధ్యయనం చేసేందుకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. 19 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో ఎక్సైజ్ డీసీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిని సభ్యులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే గొడుగు కింద ఎక్సైజ్ శాఖను తెచ్చేలా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 2020లో ఎక్సైజ్ శాఖను రెండు ముక్కలు గత వైసీపీ ప్రభుత్వం చేసింది. ఎక్సైజ్, సెబ్ విభాగాలుగా చేసి కార్యకలాపాలు నిర్వహించింది.. సిబ్బంది కొరతతో పాటు ఇబ్బందులను సెబ్, ఎక్సైజ్ శాఖ ఎదుర్కొన్నాయి. ఇక, ఎక్సైజ్ శాఖలో సంస్థాగతంగా మార్పులు చేస్తామని శ్వేత పత్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రస్తావించింది. ఆగస్టు మూడో తేదీలోకా తుది నివేదిక ఇవ్వాలని కమిటీకి ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.