ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని..…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేక పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో…
మోసలతో యుద్ధం చేస్తున్నాం.. వాలంటీర్లు ఇంటికే రావాలన్న, పెద్దవాళ్ల బతుకు మరాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. ఫ్యాన్ గుర్తు ఉన్న రెండు బటన్లు నొక్కాలి.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే దీనిపై స్పందించిన ఈసీ.. పోలింగ్ తేదీ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టుకు తెలిపింది.