ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరుకులెత్తుస్తున్నారు. మండలంలోని చందాపురం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మొండితోక జగన్ మోహన్ రావుకు బ్రహ్మరథం పట్టారు. వాహనం పై ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను మరల గెలిపించండి అంటూ మొండితోక జగన్ మోహన్ రావు అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో…
శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతుంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి చేపడుతామని చెబుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా.. అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు.
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు.
ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.