Prabhas’s Aunt Shyamala Devi Campaigns to Support BJP MP Narasapuram Candidate: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. ఇక, ఈ సారి టీడీపీ-జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో ప్రచారానికి తరలివస్తున్నారు.. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించగా…
ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాకర్ల సురేష్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ…
ఆంధ్రప్రదేశ్‌లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి బహిరంగసభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు.. ఏపీ వికాస్ మోడీ లక్ష్యంగా పేర్కొన్నారు..
చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు.. ప్రజా సేవ అని పార్టీ పెట్టి మూసేసాడని ఫైర్ అయ్యారు పోసాని.. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టిన ఆయన.. సినిమా లానే రాజకీయాల్ని కూడా బిజినెస్ లా చూశాడని ఆరోపించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడు.. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు మళ్లీ రాజకీయ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు.. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్‌లో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివేకం కలిగిన నాయకుడు అని అనుకున్నాను.. పాలసీ పరంగా విబేధాలు ఉంటే మాట్లాడవచ్చు.. కానీ, దానికి ఒక పరిమితి ఉంటుంది.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ జనసేనకి, ఎమ్మెల్యే తనకు ఓటు వేయాలని వంశీ కోరుతున్నారట…
నల్లజర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకాతిరుమలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్‌కి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహారం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విజయవాడలో మోడీ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.