చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పెత్తందారులకు ,పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న
ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా జోరుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీజాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి విచ్చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు.. నంద్యాల చేరుకున్న అల్లు అర్జున్ ను చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఫ్యాన్స్.. ఎటు చూసినా జనమే అన్న చందంగా మారిపోయింది నంద్యాల.. ఇక, గజమాల తో పుష్పకు ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పిఠాపురం వెళ్తున్నారు.. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం బయల్దేరారు.. ఇక, పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగిన విషయం విదితమే కాగా.. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అక్కడికి వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది..
హైదరాబాద్ లో వాహన రద్దీ నెలకొంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు.