Kakarla Suresh: కాకర్ల సురేష్కి మద్దతుగా కుటుంబ సభ్యుల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులోని టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో వరికుంటపాడు మండలం నాయకత్వంలో నార్త్ కొండాయపాలెం పంచాయతీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ తెలుగుదేశం కండువాలు తప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. అలాగే, కలిగిరి మండలంలోని పెద్ద అన్నలూరు గ్రామం నుంచి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తలపెట్టిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుంది. పెద్ద అన్నలూరు, కమ్మవారిపాలెం, కాకుటూరు వెలగపాడు, పాతూరు, కొత్తూరు, తిమ్మారెడ్డి పాలెం, అయ్యపురెడ్డి పాలెం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు .
Read Also: Ram Charan at Pithapuram: అమ్మ, మామయ్యతో కలిసి పిఠాపురానికి రామ్‌చరణ్
Also Read
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ఇక, ఉదయగిరి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని చేతుల జోడించి వేడుకున్నారు. ఒక్క అవకాశం ఇస్తే పుట్టిన గడ్డ రుణం తీర్చుకొని, అభివృద్ధి ఏమిటో చూపిస్తానని తెలిపారు, మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం ముందు చూపుగా ప్రణాళిక బద్ధంగా మేనిఫెస్టో విడుదల చేశానన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం, ఉదయగిరిలో గెలిచేది కాకర్ల సురేష్, నెల్లూరులో వేమిరెడ్డి విజయం తథ్యం అన్నారు. నియోజకవర్గంలో ఉన్న త్రాగునీరు సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి 50 గడపలు ఉన్న గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఓటు వేసే ముందు ఒక్కసారి అభ్యర్థుల స్థితిగతులను ఆలోచించుకొని ఓటు వేయాలని కాకర్ల సురేశ్ కోరారు.
Read Also: Liquor Shops: మందుబాబుల ముందు జాగ్రత్త.. వైన్‌షాపుల ముందు క్యూ..!
కాగా, ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం అన్న కాకర్ల వెంకట్ వదిన కాకర్ల రుక్మిణి కలిగిరి మండలం గుడ్లదోన కాలనీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించారు. అలాగే, వరికుంటపాడు మండలంలో నీ తిమారెడ్డిపల్లి, వేంపాడు, రామాపురంలకు చెందిన టీడిపి నాయకుల ఆధ్వర్యంలో రెండు వందల బైక్ లతో ఉదయగిరి నియోజక వర్గం ఎన్డీయే అభ్యర్ధి కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల సంహేత్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ యువత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక, కొండాపురం మండలంలోని పార్లపల్లి గ్రామంలో టీడీపీ- జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ సతీమణి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి నా భర్త కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించండి అన్ని కోరారు. దీంతో పాటు వింజమూరు మండలంలోని గుండెమడగల, ఊటుకూరు, తక్కెళ్లపాడు, ఇందిరా నగర్ గ్రామాలలో ఉదయగిరి ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయగిరి అభివృద్ది చెందాలంటే మా బావ కాకర్ల సురేష్ ని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాకర్ల సురేఖ కోరారు.
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!