ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 13న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు,…
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
Heavy Traffic Jam: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శని, ఆదివారల్లో తెల్లవారుజామున భారీ వాహనాల రద్దీ పెరిగింది.
Right to Vote: ఐదేళ్లపాటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. మే 13 సోమవారం పోలింగ్ జరగనుంది.
గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13 ఉదయం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసిందని.. లిక్కర్ షాపులు బంద్ అయ్యాయని అన్నారు. మరోవైపు.. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
Case Filed on Allu Arjun for Nandyala Visit: గత కొన్నాళ్లుగా ఆసక్తికరంగా జరుగుతూ వచ్చిన ఏపీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మే 13వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కూడా జరగబోతోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న స్థానికేతరులు ఇతర నాయకులు నియోజకవర్గాలను విడిచి వెళ్ళిపోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే చివరి రోజున తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే…
Cinema Politics in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సినిమా రంగానికి ఎంత కాదనుకున్నా విడదీయలేని అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో సినీ రంగానికి చెందిన ఎన్టీఆర్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లారు. ఆ తర్వాత కూడా సినీ నటులు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసే ప్రయత్నం చేశారు. అందులో కొంతమంది సఫలం అయితే మరికొంతమంది ఇది మనకు కరెక్ట్ కాదని వెనక్కి వెళ్లిపోయారు. ఆ సంగతి…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గంటల తరవాత స్థానికేతరులు కానీ.. రాజకీయ నేతలంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. అనకాపల్లి, అనంతపురం, ప.గో, తూ.గో, కర్నూలు జిల్లాల్లో నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6…