దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల 7 దశల్లో జరుగనున్నాయి. అయితే ఈ రోజు 4వ దశ పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. అయితే.. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే.. ఏపీలో ఇప్పటికే దాదాపు 15 శాతం ఓటింగ్ జరిగింది. అయితే.. లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి ఓటర్లు చైతన్య పరుస్తూ.. ఓటు హక్కు…
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో అనేక దుష్ప్రచారాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు.
పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్‌కు ముందే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. రెంటాల, పాకాలపాడు, దూళిపాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట, గురజాల గ్రామాల్లో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తన ఓటును వేశారు.