ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల ముందు.. ఓటర్లకు ప్రలోభాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా.. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసీ ఎన్ని పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ డబ్బులు, మధ్యం పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా.. డబ్బుల పంపిణీ విషయంలో కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పాదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని, అటు వంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు అంతా పాల్గొని ప్రజాస్యామ్య వ్యవస్థను పరిరక్షించు కోవాలని ఆయన విజ్ఞప్తి…
ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 80 శాతం పోలింగ్ లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్లకు పోలింగ్ మెటీరియల్ తరలింపు పూర్తయింది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
సీఎం జగన్ ఈరోజు సాయంత్రం పులివెందుల వెళ్ళనున్నారు. దాదాపు రెండు నెలలపాటు ప్రచారంలో హోరెత్తించిన ముఖ్యమంత్రి.. నిన్న పిఠాపురంలో జరిగిన సభతో ప్రచారానికి తెర వేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు సీఎం జగన్.. సాయంత్రం తన సతీమణి భారతితో కలిసి పులివెందులకు వెళ్తున్నారు. రేపు తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడుతూ.. పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చిందన్నారు. జీరో వయొలెన్స్, జీరో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్ కామ్ పెట్టామని…
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు.. కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ధర్నాకు దిగారు. దాదాపు వంద కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా స్థానిక నేతలు కొట్టేశారని మండిపడ్డారు కొండెవరం గ్రామస్తులు.
Lokshabha Elections 2024: రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సోమవారం (మే 13) ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.