AP Elections 2024: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన సిబ్బందిని కలిశారు. ఇక, తన 3వ భార్య అన్నా లెజినోవాతో కలిసి జనసేన చీఫ్ పవన్ చేతి వేలిపై సిరా ముద్ర వేసి ఈవీఎం మిషన్ దగ్గరకు పంపించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ బరిలో దిగుతున్నారు.
Read Also: AP Elections 2024 Live Updates : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు -2024 లైవ్ అప్డేట్స్
ఇక, పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ పోలింగ్ కేంద్రం దగ్గరకు భారీగా చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ట్రై చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోని.. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పవన్ సీఎం పవన్ సీఎం పవన్ సీఎం అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. ఆ తర్వాత ఓటు వేసిన పవన్ కళ్యాణ్ కీలక సందేశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు. అటు తన అభిమానులకు సైతం పవన్ సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర గుంపులు, గుంపులుగా ఉండొద్దని చెప్పుకొచ్చారు.