Naga Babu on Pithapuram Voters: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా…
ఉదయం నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ జరుగుతోందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ప్రతి చోటా 100 నుంచి 200 మంది ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదు అవుతోంది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 70 శాతానికి చేరువగా వెళ్లింది.. 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది..
10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. 96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.73 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం 1.92…