ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) రియాక్షన్ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు
ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్‌ను లేఖ ద్వారా కోరారు చంద్రబాబు.. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన..…
CM YS Jagan Said Nation will be shocked to see the AP Elections Results on June 4: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్…
Minister Gudivada Amarnath Says YCP Comes to Power in AP: పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే.. ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన…
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యంతో టీడీపీ ప్రలోభాలకు తెర లేపినా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారంటూ మండిపడ్డారు. సుమారు 300 మంది బౌన్సర్లతో టీడీపీ అభ్యర్థి బూత్‌లలో హల్చల్ చేసినా, రౌడీయిజం చేసినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి…
13వ తేదీ అయిపోయిందని, జూన్ 4వ తేదీ మిగిలే ఉందని వైసీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ వేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడండన్నారు. ఏపీలో తాము అధికారంలోకి రాబోతున్నామని, కడపలో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని, ఓ చెంప మీద కొడితే.. రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు.…
TDP Leaders House Arrest in Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. Also Read: Palnadu: తేరుకుంటున్న పల్నాడు.. తెరుచుకుంటున్న చిరు వ్యాపారాలు! వైసీపీ నేత…