రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి.. కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీస్ అబ్జర్వర్ అధికారులను, పోలీసులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి.. టీడీపీ తన ఏజెంట్లను నియమించుకుంది.
ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అంటే జూన్ 4వ తేదీ తర్వాత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది ఇంటెలిజెన్స్.. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీ వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూలహా ఇచ్చింది.
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం 81.86గా నమోదైందని ఈసీ ప్రకటించింది. 2014లో 78.90 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 79.80 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పోలింగ్ 1.5 శాతం పెరిగింది. రికార్డు పోలింగ్‌పై నందమూరి రామకృష్ణ స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్నడు కనివిని ఎరుగని, మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగిందిని.. తెలుగు జాతి మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు…
ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీవ్ (సిట్).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు.. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్.. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్.. అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ? వాటికి బీజం వేసింది ఎవరు? హింసాత్మకంగా మారడానికి…