Gudivada Amarnath: 2009లో వచ్చిన ఫలితాలే.. 2024లో రిపీట్ అవుతాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gudivada Amarnath Says YCP Comes to Power in AP: పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే.. ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పోలింగ్ శాతం 81.86గా నమోదైందని ఈసీ ప్రకటించింది. 2014లో 78.90శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 79.80శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి 1.5శాతం వరకు పెరిగింది. రికార్డు పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అని టీడీపీ అంటోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
Also Read
Also Read: Narayana Swamy: ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం
‘పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు. 2009లో మహాకూటమి వైఎస్సార్ మీద పోరాటం చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగింది. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయి. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని ఉద్దేశంతోనే జనం పోటెత్తి ఓటేశారు. గతంలో వచ్చిన దానికంటే ఒక్క సీటైనా ఎక్కువ వస్తుందని మా విశ్వాసం. గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారు. ఏకపక్షంగా విజయం సాధిస్తాం. వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరం అవుతుంది’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!