YS Jagan: జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Said Nation will be shocked to see the AP Elections Results on June 4: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఐప్యాక్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ‘ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయం. మేం మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. జూన్ 4న రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది’ అని అన్నారు.
Also Read
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
Also Read: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్!
గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) ప్రతినిధులతో సీఎం వైఎస్ సమావేశమయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ఐప్యాక్ కార్యాలయంలో సీఎం ఉన్నారు. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ పని చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు ఐప్యాక్ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు.
- Tags
- ap
- AP Elections 2024
- IPAC
- ycp
- ys jagan
తాజావార్తలు
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!