13వ తేదీ అయిపోయిందని, జూన్ 4వ తేదీ మిగిలే ఉందని వైసీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ వేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడండన్నారు. ఏపీలో తాము అధికారంలోకి రాబోతున్నామని, కడపలో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని, ఓ చెంప మీద కొడితే.. రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నిక అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య జరిగాయి. ప్రజలు ఓటేయడానికి వెయిట్ చేశారు. మొదటి విడతలో ఎన్నికలు రాలేదని బాధపడ్డారు. మేం అధికారంలోకి రాబోతున్నాం. కడపలో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయి. నెల్లూరులో 10కి 10 స్థానాలు రాబోతున్నాయి. సొంత చెల్లలను రాజకీయంగా చంపేశావ్. తల్లిని విశాఖలో పోటీ చేయించి ఓడగొట్టావ్. తల్లి, చెల్లికి ఓ రాజ్యసభ ఇవ్వలేకపోయావ్’ అని సీఎంను విమర్శించారు.
Also Read: Turtles Seized: అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత!
‘వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలి. ఓ చెంప మీద కొడితే.. రెండో చెంప చూపడానికి మేమేం గాంధీ మహాత్ములం కాదు. చంద్రబాబు సహా అంతా ఓడిపోతారని జోగి రమేష్ ఏదో అంటున్నారు. చంద్రబాబు ఇంటి మీదకు వచ్చిన జోగికి అసలు విషయం త్వరలో అర్థమవుతుంది. 13వ తేదీ అయిపోయింది, జూన్ 4వ తేదీ మిగిలే ఉంది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఆరోజు చూద్దాం’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు.