పోలింగ్ అనంతర అల్లర్లపై సిట్ విచారణ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సిట్ రంగంలోకి దిగింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం నుంచే సిట్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను సిట్ బృందం పరిశీలించింది.
కడప గౌస్ నగర్‌లో పోలింగ్ రోజున సాయంత్రం జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. సంబంధిత పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. వారికి ఛార్జ్ మెమో జారీ చేశారు జిల్లా ఎస్పీ.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏపీలో పోలింగ్ అనంతరం కొన్న చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత అలర్ల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 7కు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇరు పార్టీలలో 40 మందికి పైగా ముద్దాయిలను గుర్తించారు పోలీసులు… పులివర్తి నానిపై దాడి కేసులో ఇప్పటికే 13మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజు బ్రాహ్మణ కాల్వలో బీఎస్ఎఫ్…
ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపట్నుంచి(ఈ నెల 18) ఈ నెల 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్ఐసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు.
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు.
అల్లర నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం.