Praja Galam Public Meeting, PM Modi, Chandrababu, Pawan Kalyan, Chilakaluripeta, Andhrapradesh, AP Elections 2024, Lok Saha Elections 2024, Praja Galam Public Meeting LIVE Updates
సా.5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం సభ జరగనుంది. ఏపీ పర్యటనకు వెళ్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి సభలో ప్రసంగిస్తానంటూ.. ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందంటూ మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలిపాయి. ఇవాళ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు YCP రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
పార్టీ అధినాయకత్వం ఏం చెబితే అది చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు తెలిపారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తా.. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించాలని చంద్రబాబు చెప్పారు.. తాను సరేనన్నానని పేర్కొన్నారు. చీపురుపల్లా ఎంపీనా.. లేక ఎచ్చెర్ల అనేది కాదు.. ఏం చెబితే అది చేస్తానన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ కొన్ని శక్తులు ఉంటాయి.. దాని గురించి తానేం మాట్లాడనని తెలిపారు. ఓసారి ముందు ప్రకటించొచ్చు.. ఓసారి చివర్లో ప్రకటన రావచ్చని…
ఇసుక పాలెంలో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ-జనసేన సైనికులు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతా జనం వచ్చి, దారి పొడవునా నీరాజనాలు పలికారు. బాణా సంచాల మోతలతో ఇసుకపాలెం పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా.. కాకర్ల సురేష్ రైతు కూలీలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయం పండుగ అవుతుంది, రైతుల కష్టం తీరుతుందని అన్నారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే.. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని అన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు…
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్.. చేనేతల బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ కు కేటాయించాలని బీసీ, చేనేత నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.