సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకుని ప్రతి ఓటర్ను గుర్తించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జలదంకి మండలం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. జలదంకి మండల కన్వీనర్ కె. మధుమోహన్ రెడ్డి అధ్యక్షతన…
నెల్లూరు సిటీ పరిధిలోని జండా వీధి.. చిన్న బజార్ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి నారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు పాత నగరంలో వర్షపు నీరు రాకుండా ఉండేందుకు పలు చర్యలను గతంలో చేపట్టామన్నారు.
సిద్ధం మహా సభలను వైసీపీ ఇప్పటికే నిర్వహించింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. నాలుగు సభలలో ప్రజలు జగన్ కి నీరజనం పట్టారు.. జగన్ 99 శాతం హామీలను అమలు చేశారు.. నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు..
ఎన్టీఆర్ జిల్లాలో 16.83లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం.. 0866-2570051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.