నెల్లూరు సిటీ పరిధిలోని జండా వీధి.. చిన్న బజార్ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి నారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు పాత నగరంలో వర్షపు నీరు రాకుండా ఉండేందుకు పలు చర్యలను గతంలో చేపట్టామన్నారు. హడ్కో నుంచి 11 వందల కోట్ల రూపాయల రుణంతో టీడీపీ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు తాగునీటి పథకాన్ని తీసుకువచ్చాన్నారు. ఈ పథకానికి తీసుకు వచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం నెల్లూరు నగర పాలక సంస్థపై రుణభారాన్ని మోపారని నారాయణ ఆరోపిస్తున్నారు.
Read Also: YCP Bus Yatra Schedule: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
ప్రజలపై రుణభారం ఉండదు అని టీడీపీ అభ్యర్థి నారాయణ అన్నారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే హడ్కో రుణాన్ని చెల్లిస్తుంది.. ఈ పథకానికి సంబంధించి 90 శాతం పనులు పూర్తి అయితే ఐదేళ్లలో పది శాతం పనులు కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఈ పథకం పనులను పూర్తి చేస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు.