AP Elections 2024: ఎన్టీఆర్ జిల్లాలో 16.83లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం.. 0866-2570051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. 9154970454 వాట్సప్ నంబర్ కు ఫిర్యాదులు పంపొచ్చు.. 1950 కాల్ సెంటర్ కు EPIC కార్డులు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తరువాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించినట్టయితే IPC సెక్షన్ 188, 171H కింద చర్యలుంటాయన్నారు. జిల్లాలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు పురుషులు 20, 321మంది, మహిళలు 17, 438మంది, ఒక్క ట్రాన్సజెండర్ ఉన్నారని కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు.
Read Also: Supreme Court: CAAపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ.. 3 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం..
ఇక, సీపీ కాంతిరాణా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామన్నారు. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేశాం.. డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలి.. లెక్కలు చూపించకుంటే ఆ నగదు సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాం.. లాడ్జి, హోటల్స్ లో నిరంతరం తనిఖీ లు చేస్తున్నాం.. అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులో కి తీసుకుంటాం.. యాప్ ద్వారా ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టడం జరిగింది.. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశాం.. మూడు వేల మందికి పైగా బైండోవర్ చేశాం.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్ట్ లు పెట్టకండి అని పేర్కొన్నారు. నిబంధనలు కు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడితే చర్యలు ఉంటాయి.. నందిగామ, మైలవరం, తిరువూరు, తో పాటు అదనంగా చెక్ పోస్ట్ లు పెట్టాం.. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలి అని సీపీ కాంతిరాణా కోరారు.