ఇవాళ వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సీఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో 81 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 18 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేశాము అని తెలిపారు.
ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో అప్పుడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వత అదే నాటకం ప్రారంభించారు అని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆఫీసర్ ఎంకే మీనాతో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం అయ్యారు. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్డీఏ కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు ఫ్యాన్ పార్టీలోకి భారీగా వస్తున్నారు. తాజాగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు చేరారు.
తిరుపతి జిల్లాలో మొత్తం 2,136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఇక, జిల్లా వ్యాప్తంగా 17, 94, 733 మంది ఓటర్లు ఉన్నారు.. అందులో పురుష ఓటర్లు - 8,74,738 మంది ఉండగా, స్త్రీలు - 9,19,817 మంది ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతోనే ప్రజల్లోకి టీడీపీ అధినేత వెళ్లనున్నారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీజినల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బస్సు యాత్ర, మేనిఫెస్టోతో పాటు ఎన్నికల ప్రచారంపై కీలకంగా చర్చించనున్నారు.
నిన్న ( ఆదివారం ) ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ- బీజేపీ- జనసేన ఉమ్మడి సభ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు.