సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకుని ప్రతి ఓటర్ను గుర్తించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జలదంకి మండలం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. జలదంకి మండల కన్వీనర్ కె. మధుమోహన్ రెడ్డి అధ్యక్షతన క్లస్టర్ ఇంచార్జి మండపల్లి మాల్యాద్రి సారధ్యంలో రైతు అధ్యక్షులు పి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మంది యూనిట్ ఇంఛార్జీలు, 47 మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.
Raw Mango: పచ్చిమామిడి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..!
ఈ సందర్భంగా.. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఓటర్లకి దగ్గర కావాలని కాకర్ల సురేష్ తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకి ఎన్నికల సంఘం వచ్చే నెల 15 వరకు అవకాశం ఇచ్చిందని.. ఈ అవకాశాన్ని బూత్ కన్వీనర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జరగనున్న 54 రోజులు అత్యంత కీలకమని ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ కార్యాలయం నుండి మేనేజర్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటామని.. ఎవరికి ఎలాంటి సందేహాలు, ఎదురైన తెలియపరచాలన్నారు. బూతు కన్వీనర్లు అందరికీ ఓటర్ల లిస్టుతో పాటు.. రెండు టీ షర్ట్లు, రెండు టోపీలు అందజేశారు. విలువైన సమాచారం సేకరించేందుకు తగిన రిజిస్టర్ అందజేశారు. మండలంలోని జనసేన బీజేపీ నాయకులతో కలిసి బూతు కన్వీనర్ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలన్నారు. తెలుగుదేశం గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.
Viral News: వార్నీ.. ఏంట్రా ఈ టాలెంట్.. దండంరా బాబు..
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. బూతు స్థాయి నాయకులే పార్టీకి వారదులు అని, ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి పార్టీని అధికారంలోనికి తీసుకురావాలన్నారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని, వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని.. పసలేని విమర్శలను పట్టించుకోవద్దన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మాతో పంచుకోవాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్ అని తెలిపారు. బూతు స్థాయిలో మీ పనితీరును బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కనుక ప్రతి ఒక్కరు కష్టపడి విజయానికి తోర్పాటును అందించాలని కోరారు.