ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెంఇన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్.
నంద్యాల జిల్లా డోన్‌లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో 500 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరాయి.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు ఘాటు వ్యాఖ్యులు చేస్తున్నారు. ఈ సారి గెలుపు వైసీదేనని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు.
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు.
ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని…
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
'ప్రజాగళం' సభ యావత్ ప్రాంగణం పెమ్మసాని ప్రభంజనంతో మార్మోగింది. స్వాగత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఉంచిన ఫ్లెక్సీలు, తోరణాలతో పాటు కటౌట్లు సభ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోరుతూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో 'ప్రజాగళం' భారీ బహిరంగ సభను చిలకలూరిపేట వద్ద గల బొప్పూడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.