ఏపీ సీఎం జగన్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. చిన ముషిడివాడలోని శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ పాల్గొన్నారు. స్వామివారు జగన్ ని ఆశీర్వదించారు.
అధికార వైసీపీ నేతలకు విపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి వేణు గోపాల కృష్ణ కు సవాల్ విసిరారు. బీసీలను రెండు ప్రభుత్వాల్లో ఏది ఆదుకుందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. ప్రచారం కోసమే 56 కార్పొరేషన్లు… కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. రాజకీయాల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆరే అన్నారు అయ్యన్న. చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ, పెళ్లి…
రాష్ట్రంలో రానున్న రోజుల్లో వ్యవసాయరంగంలోని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలన్నారు ఏపీ సీఎం జగన్. అగ్రి ఇన్ ఫ్రా రంగంపై ఆయన సమీక్ష చేశారు. అగ్రి ఇన్‌ఫ్రా పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షిస్తూ కీలక సూచనలు చేశారు. వీటికి సంబంధించిన నిధుల సేకరణ, టై అప్‌లపై సమీక్షించారు. ప్రభుత్వం దాదాపు రూ.16,320.83 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని…
ఏపీ సీఎం జగన్ సోమవారం నాడు హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ మధ్యాహ్నం 3:50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్…
ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అన్నారు జగన్. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది. రాజకీయాలకు తావు ఉండకూడదు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల…
పీఆర్సీ విషయంలో సందిగ్దత తొలగించేందుకు రెడీ అవుతున్నారు. అటు మంత్రుల కమిటీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటు స్టీరింగ్ కమిటీ కూడా పట్టువిడుపులకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయి. కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. సమ్మె నోటీసులో ఇచ్చిన అన్ని అంశాలపై ఉద్యోగులు…
జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమం పై అవగాహన సదస్సులు ముగిశాయి. ఏపీ సచివాలయంలో గత మూడు రోజులుగా కొనసాగిన ప్రజాప్రతినిధులతో సదస్సులు నిర్వహించారు. చివరిరోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్ భాషా, ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పాఠశాలల మ్యాపింగ్ వల్ల…
ఏపీ ప్రభుత్వం తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. వర్చువలుగా టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలి.ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది. ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి.వైసీపీకి చెందిన 28 మంది ఎంపీలు ఉండి 32 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారు..?పాలన అంటే అప్పులు చెయ్యడం, దోచుకోవడం…
పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాలు పట్టుదలగా వున్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నిర్ణయించడంతో కీలకంగా మారింది. ప్రభుత్వంలో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. పీఆర్సీ సాధన సమితికి పూర్తి…