ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాలు, జిల్లాల కేంద్రాలపై ఇప్పటికే పలు కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే తెలంగాణ నుంచి కూడా ఓ డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ చేసిది ఎవ్వరో కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎంతో చేశారని వీహెచ్ కొనియాడారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలని చెప్పారు. కడపకు వైయస్సార్,…
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు, సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుంది.పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..?అధికారులు చదువుకున్నారో… గాడిదలు కాశారో అర్ధంకావడం లేదు. READ ALSO నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామం: తమ్మినేని సీతారాం బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది.మాకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయి.మా…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. రిపబ్లిక్ డేకి ఎంతో సమయం లేకపోవడంతో అధికారులు భారీ ఏర్పాట్లుచేశారు.
అసలే ఆదివారం. సంక్రాంతికి ఊరికి వెళ్లివచ్చినవారు తమ తమ స్వలాలకు చేరుకున్నారు. విజయవాడ బస్టాండ్లో తీవ్రమయిన రద్దీ ఏర్పడింది. కొంతమంది మాత్రమే కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరిగేవారికి ఆర్టీసీ వారు రూ.50 లు జరిమానాగా విధిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా శనివారం 43,763 శాంపిల్స్ ని పరీక్షించగా…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న క్యాబినెట్.. కొత్త పీఆర్సీ జీవోలను ర్యాటిఫై చేయనుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు కి ఆమోదం తెలపనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్.. కరోనా మహమ్మారి తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల పై ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయం పై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్ నడుస్తుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీతో…
ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ గొడవ కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టారు. పలు చోట్ల పోలీసులు ఉద్యోగులను అడ్డుకున్నారు. మరోవైపు పీఆర్సీ జీవోల విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పాట పాడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముద్దుల…
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్‌ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా మారిందన్నారు. గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలపై…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓ వైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా…
గత ఏడాది నవంబరులో అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తిస్థాయిలో మెరుగుపడింది. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ… ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన కుటుంబానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. Read Also: నేటితో ‘అఖండ’ 50 రోజులు.. 103 సెంటర్లలో మాస్ జాతర బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కాల్ చేసి ప్రభుత్వం…