ఏపీ సీఎం జగన్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. చిన ముషిడివాడలోని శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ పాల్గొన్నారు. స్వామివారు జగన్ ని ఆశీర్వదించారు.