అధికార వైసీపీ నేతలకు విపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి వేణు గోపాల కృష్ణ కు సవాల్ విసిరారు. బీసీలను రెండు ప్రభుత్వాల్లో ఏది ఆదుకుందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. ప్రచారం కోసమే 56 కార్పొరేషన్లు… కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు.
రాజకీయాల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆరే అన్నారు అయ్యన్న. చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ, పెళ్లి కానుక పథకాలు ఎందుకు రద్దు చేశారు?అని ఆయన ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్ నిధులు అమ్మఒడి, వసతి దీవెనకు ఎందుకు మళ్ళించారు? బీసీలకు ఏమీ చేయకుండా డబ్బాలు కొట్టుకోవద్దని అయ్యన్న సవాల్ విసిరారు.